Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 137.50 పాయింట్లు లాభపడి.. 56,239.42 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30.45 పాయింట్ల లాభంతో 19,465.00 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన వ్యతిరేక పవనాలతో ఉదయం మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 65,238.67 వద్ద ప్రారంభమై.. ఓ దశలో 400 పాయింట్లు నష్టపోయింది. రెండో సెషన్లో కోలుకుంది. ఇంట్రాడేలో ఓ దశలో 65,032-65,605.74 పాయింట్ల మధ్య కదలాడింది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి 137.50 పాయింట్ల లాభపడింది. ఆటో, రియల్టీ, హెల్త్‌కేర్ రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీలో అపోలో హాస్పిటల్స్ 2.5శాతం లాభంతో టాప్ గెయిర్గా నిలిచింది. అదే సమయంలో 1.5శాతం పతనమై టాటా స్టీల్ టాప్ లూజర్‌గా నిలిచింది. సెనెక్స్లో అల్ట్రాటెక్ సిమెంట్, టాటామోటార్స్, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, పవర్ గ్రిడ్, మారుతి, ఎల్టీ, విప్రో తదితర షేర్లు లాభాల్లో కొనసాగాయి. టైటాన్, ఏషియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ తదితర షేర్లు నష్టాల్లో ముగిశాయి.
ఇదిలా ఉండగా.. విమానయాన సంస్థ ఇండిగో షేర్లలో భారీగా నష్టపోయాయి. ఇండిగో మాత్ర సంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో రాజేశ్ గంగ్వాల్ కుటుంబం మరోసారి తమ వాటాను విక్రయించనుందన్న వార్తల నేపథ్యంలో షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇండిగో షేర్లు 3.57శాతం క్షీణించి.. రూ.2,458 వద్ద ముగిసింది. కంపెనీ ప్రమోటర్లు గంగ్వాల్ కుటుంబం కంపెనీలో దాదాపు 4శాతానికి సమానమైన బ్లాక్ డీల్ ద్వారా 450 మిలియన్ డాలర్లు సమీకరించుకునేందుకు ఒప్పందం చేసుకుంటుందన్న వార్తల నేపథ్యంలో ఇండిగో స్టాక్ ధర పతనమైనట్లు భావిస్తున్నారు.