Stock market | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 234 పాయింట్ల లాభంతో 61,963.68 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 111 పాయింట్లు పెరిగి 18,314.40 పాయిట్ల వద్ద ట్రేడింగ్ ముసిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ సూచీలు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి సూచీలు పుంజుకున్నాయి. ట్రేడింగ్ సెషన్లో మార్కెట్లో ఐటీ, మెటల్ రంగ షేర్లలో పెరుగుదల కనిపించింది. నిఫ్టీ ఐటీ, మెటల్ సూచీలు రెండు శాతం లాభాలతో ముగిశాయి.
నిఫ్టీలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, దివీస్ లేబొరేటరీస్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా అత్యధికంగా లాభపడగా, నెస్లే ఇండియా, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా నష్టపోయాయి. సెక్టార్లలో మెటల్ ఇండెక్స్ 3 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 2 శాతం, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్ సూచీలు ఒక్కొక్క శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి.