FSL Fire Accident | నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం.. కీలక విషయాలు వెల్లడించిన శిఖా గోయెల్
FSL Fire Accident | హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయన్న ప్రచారంపై ఆ సంస్థ డైరెక్టర్ శిఖా గోయెల్ స్పందించారు.
FSL Fire Accident | హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయన్న ప్రచారంపై ఆ సంస్థ డైరెక్టర్ శిఖా గోయెల్ స్పందించారు. ఫైర్ యాక్సిడెంట్లో రెండు కీలక కేసుల్లోని ఆధారాలు కాలిపోయినట్లుగా దుష్ప్రచారం జరుగుతోందని.. ఆయా కేసులకు సంబంధించిన సామగ్రిని గతంలోనే కోర్టుకు అప్పగించామని తెలిపారు. 2015 నాటి ఏసీబీ కేసు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
శనివారం ఉదయం 10.08 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని.. ఫైర్ సిబ్బంది 1.30 గంటలకు మంటలు ఆర్పివేశారని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్, ట్రైనింగ్హాలుతో పాటు లైబ్రరీ, హెచ్ఆర్డీ రూమ్‌కు మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఎల్లో అగ్నిప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని శిఖా గోయెల్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై వారు దర్యాప్తు చేపట్టారని పేర్కొన్నారు. జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారని.. దీనిపై స్పష్టత వచ్చాక వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని శిఖా గోయెల్ తెలిపారు. రెండు కీలక కేసుల్లోని ఆధారాలు కాలిపోయినట్లు దుష్ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. ఆయా కేసులకు సంబంధించిన సామగ్రిని గతంలోనే కోర్టుకు అప్పగించామని చెప్పారు. 2015 నాటి ఏసీబీ కేసు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసులోనూ ఆధారాలు కోర్టుకు సమర్పించామని.. 2024 వరకు సేకరించిన 16 ఆధారాల్లో 7 మినహా మిగతావన్నీ న్యాయస్థానానికి ఇచ్చేశామన్నారు. అన్ని ఆధారాలు, పరికరాలను ఎఫ్ఎస్ఎల్ సురక్షితంగా ఉంచుతుందని తెలిపారు. ఏదైనా జరిగితే మా టీమ్ సమాచారాన్ని పునరుద్ధరిస్తుందని వివరించారు.
2015 కేసు అంటున్నారు కానీ ఓటుకు నోటు కేసు పేరు చెప్పడానికి అంత భయం ఎందుకు? pic.twitter.com/CKbb2MwBdo
— Telugu Scribe (@TeluguScribe) February 8, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

