అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు జరిగాయి . మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ అధికారులు వెల్లడించారు.
మార్చి 20న రంజాన్ పండుగ ( Ramzan Festival ) ఉండడంతో ఆ రోజు జరుగవలసిన ఇంగ్లిష్ ( English ) పరీక్షను మరుసటి రోజు 21 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. మిగిలిన అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయని తెలిపారు.
మార్చి 16న మొదటి లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న ఇంగ్లిష్, 23న మ్యాథ్స్, 25న ఫిజికల్ సైన్స్, 27న బయోలజీ, 30న సోషల్ స్టడీస్, ఏప్రిల్ 1న ఒకేషనల్ కోర్టుకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు.