Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో మొదలయ్యాయి. 290 పాయింట్ల లాభంతో 61,037 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. నిఫ్టీ సైతం 92.35 పాయింట్ల లాభంతో 18,104 పాయింట్ల ట్రేడవుతున్నది. సెన్సెక్స్ ప్రారంభంలో 0.53 శాతం, నిఫ్టీ 0.66 శాతం లాభపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 61,166, నిఫ్టీ 18,140 పాయింట్లకుపైగా ట్రేడవుతున్నది.
రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, దివిస్ ల్యాబ్స్, గ్రాసిమ్స్, అపోలో హాస్పిటల్, రెడ్డీస్ ల్యాబ్ లాభాల్లో కొనసాగుతుండగా.. యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, కోల్ ఇండియా, లార్సెట్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరో వైపు ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. నిక్కీ 27,610 పాయింట్లు, స్ట్రెయిట్ టైమ్స్ 3125, హంగ్సెంగ్ 15,033 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. మరో వైపు యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ నెల 2న వడ్డీ రేట్లు ప్రకటించనున్నది. ఈ క్రమంలో భారత మార్కెట్లో ఎఫ్ఐఐ ట్రెండ్ మంగళవారం సానుకూలంగా కనిపిస్తోంది.