ముంబై, జూలై 9: దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. వాహన, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. ఒక దశలో 400 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 391.26 పాయింట్లు ఎగబాకి 80,351.64 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ సైతం 112.65 పాయింట్లు అందుకొని రికార్డు స్థాయి 24,443.20 వద్ద స్థిరపడింది.