Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను అధిగమించి.. లాభాల్లోకి దూసుకెళ్లాయి. అన్నిరంగాల్లో కొనుగోళ్లు జరిగాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,900 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 81,667.68 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. గరిష్టంగా 82,247.73 పాయింట్లను తాకింది. చివరకు 398.45 పాయింట్ల లాభంతో 82,172.10 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం నిఫ్టీ 135.65 పాయింట్లు పెరిగి 25,181.80 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.75శాతం పెరగ్గా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీలో అత్యధికంగా లాభపడినవి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, జెఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లాభపడ్డాయి. టాటా కన్స్యూమర్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, టైటాన్ కంపెనీ, భారతి ఎయిర్టెల్ నష్టపోయాయి.
సీఈవో రాజీనామాతో ఓస్వాల్ ఆగ్రో మిల్స్ షేర్లు 3శాతం పడిపోయాయి. 1.2 మిలియన్ షేర్ల బ్లాక్ డీల్‌తో టాటా స్టీల్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రూ.144 కోట్ల విజేత ప్రాజెక్ట్‌తో గరుడ కన్స్ట్రక్షన్ షేర్లు 5శాతం పెరిగాయి. రూ.303 కోట్ల విలువైన ఎగుమతి ఆర్డర్లతో హెచ్ఎఫ్సీఎల్ షేర్లు. రూ.290 కోట్ల ఈపీసీ ప్రాజెక్ట్‌ను దక్కించుకోవడంతో జీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ షేర్లు 3.5శాతం వృద్ధిని నమోదు చేశాయి. క్యూ2 ఆదాయం 6.5శాతం పెరిగినప్పటికీ సెంకో గోల్డ్ షేర్లు 4శాతం పతనం కాగా.. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ షేర్లు 4శాతం పెరిగాయి. హిందుస్తాన్ కాపర్, టాటా స్టీల్, ఎటర్నల్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, ఉషా మార్టిన్, ఆస్టర్ డిఎం హెల్త్‌కేర్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి 120 కి పైగా స్టాక్‌లు బీఎస్ఈలో 52 వారాల గరిష్టాన్ని తాకాయి. ఇక రూపాయి ప్రతికూలంగా ట్రేడవుతున్నది. ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. యూఎస్ డాలర్‌తో పోలిస్తే 4 పైసలు తగ్గి 88.79 వద్ద ముగిసింది.