Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా రెండోరోజు నష్టాల్లో ముగిశాయి. భారీ అమ్మకాల తర్వాత ఆసియా మార్కెట్లు గురువారం లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 82,469.79 నష్టాల్లో మొదలైంది. ఈ క్రమంలో సెన్సెక్స్ 82,617.49 పాయింట్ల గరిష్ఠానికి చేరుకోగా.. ఇంట్రాడేలో 82,130.44 పాయింట్ల కనిష్ఠానికి పతనమైంది. చివరకు 151.48 పాయింట్ల నష్టంతో 82,201.16 వద్ద ముగిసింది.
నిఫ్టీ 53.60 పాయింట్ల నష్టపోయి.. 25,145.10 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో దాదాపు 2,185 షేర్లు పెరగ్గా.. మరో 1,585 షేర్లు పతనమ్యాయి. మరో 99 మాత్రం మారలేదు. నిఫ్టీలో టైటాన్ కంపెనీ, ఎల్టీఐఎండ్ట్రీ, విప్రో, బీపీసీఎల్, ఐటీసీ లాభాల్లో ముగిశాయి. కోల్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్, గ్యాస్, రియాల్టీలో అమ్మకాలు.. మెటల్, ఐటీ, టెలికాం మరియు మీడియాలో కొనుగోళ్లు కనిపించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
Union Finance Minister | పన్ను ఎగవేతను నిరోధించడంపై ఫోకస్ : నిర్మలా సీతారామన్
Mass layoffs | కొనసాగుతున్న లేఆఫ్స్ పర్వం.. ఆగస్టులోనే 27 వేల మంది టెకీలపై వేటు..