Union Finance Minister : ఆర్థిక మంత్రులుగా వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి వచ్చినప్పుడు మరింత సరళీకరణ, అధిక హేతుబద్ధీకరణతో పాటు పన్ను ఆదాయాన్ని పెంచడానికి మనం ఎలా పని చేయాలనే దానిపై మాట్లాడతారని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. చెన్నైలో గురువారం రెవెన్యూ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ఆర్ధిక మంత్రులు పాల్గొనే జీఎస్టీ భేటీల్లో రాజకీయాల పాత్ర అతితక్కువగా ఉంటుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రతి ఆర్ధిక మంత్రి ఆదాయాల పెంపుపై దృష్టి సారిస్తారని, పన్ను మూలాన్ని విస్తృతపరచాలని కోరుకుంటారని చెప్పారు. కానీ ప్రతి ఆర్ధిక మంత్రి తన సొంత నియోజకవర్గానికి వెళ్లినప్పుడు తాము కేవలం ఆదాయాన్ని సమీకరించడం లేదని ప్రజలకు చెప్పగలగాలని అన్నారు.
ఆదాయ కల్పన అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను ఎగవేతను ఎలా నిరోధించాలి, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనేది చూడటమేనని మంత్రి పేర్కొన్నారు. పన్ను వ్యవస్ధకు లోబడి ఉండేలా వ్యవస్ధను సరళీకరించాలని పిలుపు ఇచ్చారు. పన్ను హేతుబద్ధీకరణ, పన్ను ఆదాయం పెంపు, సరళీకరణ తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
Read More :