Arvind Kejriwal | అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చేనా..? ముఖ్యమంత్రి పిటిషన్లపై నేడు ‘సుప్రీం’ విచారణ..!
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ బెయిల్ పిటిషన్‌తో పాటు అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ కూడిన ధర్మాసనం ఆయా పిటిషన్లును విచారించే అవకాశం ఉన్నది.
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ బెయిల్ పిటిషన్‌తో పాటు అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ కూడిన ధర్మాసనం ఆయా పిటిషన్లును విచారించే అవకాశం ఉన్నది. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు సీబీఐకి ఆగస్టు 23 వరకు అనుమతి ఇచ్చింది. కౌంటర్‌పై సమాధానం ఇచ్చేందుకు కేజ్రీవాల్‌కు రెండురోజుల గడువు ఇచ్చింది. బెయిల్, సీబీఐ తనను అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. తన అరెస్టును సమర్థిస్తూ ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సవాల్ చేశారు. మద్యం పాలసీ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జ్యుడీషియల్ కస్టడీలో రిమాండ్‌లో ఉన్న సమయంలోనే జూన్ 26న సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. ఈడీ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను ఇవ్వగా.. సీబీఐ కోర్టులో ఈ నెల 14న మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో కోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రికి ఊరట కల్పిస్తుందా? లేదా? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

