Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 720.60 పాయింట్ల నష్టంతో 79,223.11 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 80,072 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 79,147.32 పాయింట్ల కనిష్ట స్థాయి వరకూ సాగింది. మరోవైపు, ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 183.90 పాయింట్లు కోల్పోయి 24,004.75 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్లో 24,196.45 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లి, 23,978.15 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది.
బీఎస్ఈ-30 సెన్సెక్స్ లో జోమాటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టీసీఎస్ షేర్లు భారీగా నస్టపోయాయి. టాటా మోటార్స్, టైటాన్, నెస్లే ఇండియా, హిందూస్థాన్ యూనీ లివర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభ పడ్డాయి. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 75.61 డాలర్లు పలికితే, ఔన్స్ బంగారం 2670 డాలర్ల వద్ద ట్రేడయింది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, ఐటీ స్టాక్స్ మీద అమ్మకాల ఒత్తిడితో సూచీలు పతనం అయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర బ్లూచిప్ కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఎన్ఎస్ఈ-50 నిఫ్టీలో 32 స్టాక్స్ నష్టాల్లోనే ముగిశాయి. విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, సిప్లా వంటి స్టాక్స్ 2.83 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, టైటాన్, నెస్లే ఇండియా, ఎస్బీఐ లైఫ్ తదితర 18 స్టాక్స్ 5.11 శాతం వరకూ లాభ పడ్డాయి. బ్రాడర్ మార్కెట్లు – నిఫ్టీ మిడ్ క్యాప్-100 సూచీ 0.30 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్-100 సూచీ 0.24 శాతం నష్టాలతో ముగిశాయి.
ఇక సెక్టార్ల వారీగా ఇండెక్సుల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 616 పాయింట్ల నష్టంతో 50,988.80 పాయింట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.53 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.94 శాతం నష్టపోయాయి. నిప్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ ఓఎంసీ ఇండెక్సులు 1.26 శాతం లాభ పడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్సులు 1.44 శాతం వరకూ నష్టాలతో ముగిశాయి.