ముంబై, జూన్ 18: స్టాక్ మార్కెట్లపై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రతరం కావడంతోపాటు అమెరికా ఫెడరల్ వడ్డీరేట్లపై ఈవారంలోనే నిర్ణయం తీసుకోనుండటం పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది.
ఇంట్రాడేలో 300 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 138.64 పాయింట్లు కోల్పోయి 81,444.66 పాయింట్ల వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ 41.35 పాయింట్లు నష్టపోయి 24,812.05 వద్దకు చేరుకున్నది.
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ 1.79 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు అదానీ పోర్ట్స్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లె, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీ రంగ షేర్లు నష్టపోయాయి. కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ 5.12 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది.