Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఫ్లాట్గా స్థిర పడ్డాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 9.83 పాయింట్ల లబ్ధితో 79,496.15 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గ ట్రేడింగ్లో సెన్సెక్స్ 80,102.14 పాయింట్ల నుంచి 79,001.34 పాయింట్ల మధ్య తచ్చాడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 6.90 పాయింట్ల వృద్ధితో 24,141.34 పాయింట్ల మధ్య ముగిసింది. నిప్టీ అంతర్గత ట్రేడింగ్ లో 24,336.80 పాయింట్ల నుంచి 24,004.60 పాయింట్ల మధ్య ట్రేడయింది.
నిఫ్టీ-50లో 30 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్, సిప్లా, ఓఎన్జీసీ తదితర స్టాక్స్ 8 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్, హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్స్ మహీంద్రా తదితర స్టాక్స్ 4.35 శాతం వరకూ లాభాలతో ముగిశాయి. బజాజ్ ఆటో ఫ్లాట్ గా ముగిసింది. నిఫ్టీ స్మాల్ క్యాప్-100 1.20 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ -100 0.88 శాతం నష్టంతో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫైనాన్సియల్స్, నిఫ్టీ బ్యాంకింగ్ తదితర ఇండెక్సులు నష్టపోగా, నిఫ్టీ హెల్త్ కేర్, మెటల్, మీడియా ఇండెక్సులు ఒక శాతం పతనం అయ్యాయి.