న్యూఢిల్లీ, జూలై 16: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)..ఈక్విటీ, డెబిట్ మార్కెట్ల నుంచి రూ.45 వేల కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది. దీంట్లో క్యూఐపీ ద్వారా రూ.25 వేల కోట్ల నిధులు కూడా ఉన్నాయి. బుధవారం బ్యాంక్ క్యూఐపీల విక్రయాన్ని ప్రారంభించింది.
దీంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా బాండ్లను విక్రయించడంతో మరో రూ.20 వేల కోట్లను సమీకరించాలని యోచిస్తున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ.15 వేల కోట్లను క్యూఐపీ ద్వారా సేకరించిన విషయం తెలిసిందే.