ChatGPT | ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌బాట్ (AI chatbot) చాట్‌జీపీటీ (ChatGPT) సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. దీనిపై యూజర్లు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు.
డౌన్‌డిటెక్టర్ (Downdetector) ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సమస్య తలెత్తింది. మధ్యాహ్నం 3:15కి సమస్య గరిష్ఠ స్థాయికి చేరింది. మొబైల్ యాప్, వెబ్ రెండింటిలోనూ ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఏదైనా ప్రశ్నలు వేయగా దాన్ని స్వీకరించేందుకు చాట్ జీపీటీ నిరాకరిస్తోందని, ప్రశ్న తీసుకున్నా త్వరగా స్పందించడం లేదని యూజర్లు పేర్కొంటున్నారు.
అంతేకాదు లాగిన్, నెట్వర్క్ ఎర్రర్, యాప్ సంబంధిత ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటి వరకూ వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డిటెక్టర్ తెలిపింది. ‘చాట్ జీపీటీ డౌన్’ అంటూ యూజర్లు ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. దేశంలో 88శాతం మంది వెబ్ సైట్ ద్వారా చాట్ జీపీటీ వినియోగించే వాళ్లు ఫిర్యాదు చేయగా, 8 శాతం మంది మొబైల్ అప్లికేషన్ ఉపయోగించే యూజర్లు ఫిర్యాదు చేశారు.
2022 చివర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పని చేసే చాట్‌జీపీటీని ఓపెన్ ఏఐ అందుబాటులోకి తెచ్చింది. ఈ చాట్‌బోట్ సాయంతో యూజర్లు తమకు అవసరమైన ఖచ్చితమైన సమాచారాన్ని సెకన్లలోనే అందుకోవచ్చు. ఎలాంటి క్లిష్ట ప్రశ్నకైన ఇది అలవోకగా సమాధానం చెబుతుండటంతో చాలా మంది దీన్ని వాడేందుకు మక్కువ చూపుతున్నారు.
Also Read..
Digital Payment | భారత్‌లో 46 కోట్ల మంది డిజిటల్ చెల్లింపులను ఉపయోగిస్తున్నారు : కేంద్రం
India’s poverty | దేశంలో తగ్గుతున్న పేదరికం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక
ఆర్ఆర్ఎల్ఆర్, ఎంసీఎల్ఆర్లకు బ్యాంకర్ల కోత.. దిగొస్తున్న లోన్ టెన్యూర్, ఈఎంఐల భారం