హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : 136 ఏండ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రం బయట తొలిసారిగా ఒడిశాలోని నైనీ బ్లాక్లో బొగ్గు తవ్వకాలను ప్రారంభించింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం హైదరాబాద్లోని ప్రజాభవన్ నుంచి వర్చువల్గా ఈ గనిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒడిశాలో బొగ్గుగనిని ప్రారంభించుకోవడం సువర్ణాధ్యాయమని, దీని ద్వారా అంతర్జాతీయ విస్తరణకు సింగరేణి శ్రీకారం చుట్టిందన్నారు. ఇక నుంచి ఇతర దేశాలకు సైతం సింగరేణి విస్తరిస్తుందని, తద్వారా గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోనుందన్నారు.
నైనీ సమీపంలో 160 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు, సింగరేణి స్ంథస్థ చరిత్రలో మొదటిసారిగా రాష్ట్రం బయట బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం పట్ల సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. రాష్ర్టానికి వెలుగులు పంచుకుని సింగరేణి నైనీ బొగ్గు బ్లాక్లో తవ్వకాలతో బంగారు బాటలేసిందన్నారు.