Silver Price | న్యూఢిల్లీ, మే 16:వెండి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీలో గురువారం ఒకేరోజు కిలో వెండి ఏకంగా రూ.1,800 అధికమై రికార్డు స్థాయి రూ.88 వేలు దాటింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి రూ.88,700 పలికింది. అంతకుముందు ఇది రూ.86,900గా ఉన్నది. ఇటు హైదరాబాద్లో కిలో వెండి రూ.1,500 ఎగబాకి రూ.89,100 పలికింది.
వెండితోపాటు బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పుత్తడి ధర రూ.650 అందుకొని రూ.74,050కి చేరుకున్నది. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం పుత్తడి ధర రూ.770 అధికమై రూ.74,020కి చేరుకోగా, 22 క్యారెట్ల ధర కూడా రూ.700 అధికమై రూ.67,850కి చేరింది.