వెండి వెలుగులు.. రూ.4,300 పెరిగిన కిలో ధర
బంగారం, వెండి మళ్లీ పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు నిలకడగా ఉన్నప్పటికీ దేశీయంగా రిటైలర్లు, స్టాకిస్టులు అధికంగా కొనుగోలు జరపడంతో ధరలు భారీగా పుంజుకున్నాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: బంగారం, వెండి మళ్లీ పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు నిలకడగా ఉన్నప్పటికీ దేశీయంగా రిటైలర్లు, స్టాకిస్టులు అధికంగా కొనుగోలు జరపడంతో ధరలు భారీగా పుంజుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.4,300 ఎగబాకి రూ.2,57,300కి చేరుకున్నది.
అంతకుముందు ఇది రూ.2.53 లక్షలుగా ఉన్నది. వెండితోపాటు బంగారం కూడా అధికమైంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.800 అందుకొని రూ.1.57 లక్షలకు చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ వెండి 1.09 డాలర్లు లేదా 1.35 శాతం తగ్గి 79.71 డాలర్లకు పడిపోగా, బంగారం 4,805.09 డాలర్లకు చేరుకున్నది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం, పలు దేశాల ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో పసిడికి డిమాండ్ పడిపోయిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

