అంత్యక్రియలు జరిపాక.. మనిషి తిరిగొచ్చాడు..! అసలేం జరిగిందంటే
అంత్యక్రియలు జరిపాక.. మనిషి తిరిగొచ్చాడు..! రాజస్థాన్‌లో ఒక మ్రుతదేహానికి అంత్యక్రియలు జరిపిన వారానికి ఆ వ్యక్తి సజీవంగా తిరిగొచ్చాడు. అసలేం...

జైపూర్: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చనిపోయాడని ఓ వ్యక్తికి అంత్య క్రియలు నిర్వహిస్తే వారం తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వచ్చిన ఘటన తాజాగా బయటపడింది. రాజ్‌సమంద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వ దవాఖాన ఆర్కే హాస్పిటల్లో మరణించిన గోవర్దన్ ప్రజాపతి మ్రుతదేహాన్ని పొరపాటున ఓంకార్ లాల్ గడులియా బంధువులు తీసుకెళ్లారని విచారణలో తేలింది. వారిద్దరూ అదే దవాఖానలో చికిత్స పొందారు.
అసలు కథేమిటంటే ఓంకార్ లాల్ గడూలియా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే ఈ నెల 11న ఉదయ్‌పూర్‌కు వెళ్లాడు. లివర్ సంబంధ ఆరోగ్య సమస్యతో ఒక దవాఖానకు వెళ్లాడు.
అదే రోజు గోవర్దన్ ప్రజాపత్ చికిత్స కోసం ఆర్కే హాస్పిటల్లో చేరాడు. కానీ తర్వాత మరణించాడు. కానీ, మ్రుతదేహం కుడి చేయి చూసి గోవర్దన్‌ను గడూలియాగా పొరపాటుగా గుర్తించారు. పోలీసులు కూడా పోస్ట్‌మార్టం, డీఎన్ఏ పరీక్ష నిర్వహించకుండానే మ్రుతదేహాన్ని అప్పగించారు.
అప్పటికే కుళ్లిపోయిన దశలో ఉన్న గడూలియా మ్రుతదేహానికి ఈ నెల 15న ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ ఈ నెల 23న గడూలియా ఇంటికి రావడంతో అంతా షాక్‌కు గురయ్యారు.
దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోవర్దన్ ప్రజాపత్ మ్రుత దేహానికి గడూలియా కుటుంబం అంత్యక్రియలు నిర్వహించిందని నిర్దారించారు.
నర్సింగ్, మార్చురీ సిబ్బంది వల్లే పొరపాటు జరిగిందని దవాఖాన అధికారులు అంగీకరించారు. ఈ ఘటనపై చర్య తీసుకుంటామని దవాఖాన మెడికల్ ఆఫీసర్ లలిత్ పురోహిత్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
టాటా గ్రూప్ చేతికి ఆన్లైన్ సరుకుల బిగ్ బాస్కెట్
సరికొత్త రికార్డు తాకిన నిఫ్టీ…
పేటీఎం భారీ ఐపీవో రూ.21,800 కోట్ల సమీకరణ
ఎన్ఐఏ అదుపులో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది
రాబర్ట్ వాద్రాకు ఊరట : ఐటీ నోటీసులపై బదులిచ్చేందుకు మరో మూడు వారాల గడువు
31 కోట్లతో డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్న బిగ్ బీ
ఆయన ఓ ఫైవ్ స్టార్ పొలిటీషియన్ : బీజేపీ
2డీజీ డ్రగ్ సాచెట్ ఖరీదు రూ 990
జాతీయ జెండాను కేజ్రీవాల్ అవమానించారు : కేంద్రమంత్రి
corona helpline : కరోనా బాధితుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..
Infographs: కోవిడ్ సెకండ్ వేవ్.. ఇండియాలో వైరస్ ఎలా దాడి చేసిందో చూడండి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 21-10-2023 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

