ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 మంగళవారం 1.5శాతం లాభపడ్డాయి. బీఎస్ఎస్ సెన్సెక్స్ 700 పాయింట్లు పెరిగి 53.700కు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ-50 ఇండెక్స్ 16,050 పాయింట్లకు పెరిగింది. టాటాస్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, హెచ్‌యూఎల్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఏషియన్ పేయింట్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ ఒక శాతానికిపైగా పెరిగి 33,939కి చేరింది.
ఇదిలా ఉండగా.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేర్లు ఇవాళ స్టాక్ ఎక్చ్సేంజ్‌లో తగ్గింపు ధరతో ప్రారంభమాయ్యయి. ఇష్యూ ప్రైస్ రూ.949 కాగా.. రూ.867 వద్ద లిస్ట్ అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.42వేల కోట్లు ఆవిరైంది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.57 లక్షల కోట్లకు పడిపోయింది. ఇష్యూ ప్రైస్‌తో పోలిస్తే ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ.6 లక్షల కోట్లకు పైనే ఉండాలి. ఎల్ఐసీ లిస్టింగ్‌ను గమనిస్తే.. బీఎస్ఈలో షేరు రూ.867 వద్ద లిస్ట్
అయ్యింది. అంటే 8.62 శాతం డిస్కౌంట్లో లిస్ట్ అయ్యింది. అలాగే ఎన్ఎస్ఈలో చూస్తే 8.11 శాతం డిస్కౌంట్ ప్రారంభం కాగా.. తర్వాత షేరు ధర కొంత మేర కోలుకుంది. రూ.905 వద్ద ట్రేడ్ అవతుఉండగా.. 4.55 శాతం పడిపోయింది.