Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 236.18 పాయింట్లు (0.29 శాతం) నష్టంతో 81,289.96 పాయింట్ల వద్ద స్థిర పడింది. అంతర్గత ట్రేడింగ్లో 81,211.64 పాయింట్ల అత్యంత కనిష్ట స్థాయి నుంచి 81,680.97 పాయింట్ల గరిష్టం మధ్య తచ్చాడింది. బీఎస్ఈ-30లో 18 స్టాక్స్ పతనాలతోనే ముగిశాయి. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 93.10 పాయింట్లు (0.38 శాతం) నష్టంతో 24,548.70 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 24,675.25 పాయింట్ల నుంచి 24,527.95 పాయింట్ల మధ్య తచ్చాడింది. బ్రాడర్ మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ -100 0.46 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్-100 0.9 శాతం నష్టపోయాయి.
ఎన్ఎస్ఈ-50లో 35 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ఎన్టీపీసీ, హిందూస్థాన్ యూనీ లివర్, కోల్ ఇండియా, హీరో మోటో కార్ప్, బీపీసీఎల్ తదితర స్టాక్స్ 2.63 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు అదానీ ఎంటర్ ప్రైజెస్, భారతీ ఎయిర్ టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ స్టాక్స్ 1.90 శాతం వరకూ లాభ పడ్డాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్ ఇండెక్సులు 0.77 శాతం వరకూ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.09 శాతం నష్టపోగా, వాటిలో హిందూస్థాన్ యూనీ లివర్, గోద్రేజ్ ప్రాపర్టీస్, కోల్గేట్ పాల్మోలివ్ స్టాక్స్ పతనం అయ్యాయి. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ 84.87 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 73.68 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. మరోవైపు, ఔన్స్ బంగారం 2747 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.
అంతకు ముందు మధ్యాహ్నం మూడు గంటల సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 297.52 పాయింట్లు (0.36శాతం) నష్టపోయి 81,228.62 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 110.70 పాయింట్లు (0.45 శాతం) పాయింట్ల పతనంతో 24,531.10 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ-30లో సగానికి పైగా స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ఎన్టీపీసీ 2.61 శాతం, హిందూస్థాన్ యూనీ లివర్, లార్సెన్ అండ్ టర్బో, టాటా మోటార్స్, మారుతి సుజుకి ఇండియా తదితర స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. మరోవైపు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 2.21 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ స్టాక్స్ లాభ పడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ-50లో సుమారు 34 స్టాక్స్ నష్టాల్లోనే సాగాయి. ఎన్టీపీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ 2.41 శాతం చొప్పున, హీరో మోటో కార్ప్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, లార్సెన్ అండ్ టర్బో స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
ఐటీ, మెటల్ ఇండెక్సులు మినహా అన్ని స్టాక్స్ నష్టాలతోనే సరిపెట్టుకున్నాయి. ఐటీ ఇండెక్స్ 1.05 శాతం, మెటల్ ఇండెక్స్ 0.36 శాతం లాభ పడ్డాయి. మీడియా ఇండెక్స్ గరిష్టంగా 1.84 శాతం, ఎఫ్ఎంసీజీ 0.95, ఆటో 0.80, పీఎస్యూ బ్యాంకు 0.69 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.62 శాతం నష్టాలతో ముగిశాయి. గురువారం సాయంత్రం వెలువడే నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణంపైనే ఇన్వెస్టర్ల దృష్టి కేంద్రీకరించారు. గురువారం ఉదయం నుంచి స్టాక్ మార్కెట్ల ఇండెక్సులు ఫ్లాట్గా ట్రేడింగ్ అయ్యాయి. తర్వాత అంతర్జాతీయంగా వచ్చిన మిశ్రమ సంకేతాలకు అనుగుణంగా లాభాల్లోకి మళ్లాయి.