ముంబై, డిసెంబర్ 19: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. బ్యాంకింగ్, చమురు, ఎఫ్ఎంసీజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండె క్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 468.38 పాయిం ట్లు లాభపడి 61,806.19 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 151.45 పాయింట్లు అందుకొని 18,420.45 వద్ద స్థిరపడింది.