గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 830 పాయింట్లు లేదా 1.17 శాతం, నిఫ్టీ 291 పాయింట్లు లేదా 1.37 శాతం చొప్పున బలపడ్డాయి.
ముంబై, డిసెంబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కూడా తోడవడంతో మంగళవారం సూచీలు లాభపడ్డాయి. ఇంట్రాడేలో 350 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 229.84 పాయింట్లు పెరిగి 71,336.80 వద్ద ముగిసింది. హెవీవెయిట్ షేైర్లెన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు లాభపడటంతో సూచీలు కదంతొక్కాయి. మరో సూచీ నిఫ్టీ కూడా 91.95 పాయింట్లు అందుకొని 21,441.35 వద్ద స్థిరపడింది.