Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్లాట్‌గా మొదలైన మార్కెట్లు.. పొద్దంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఏ దశలోనూ మార్కెట్ కోలుకోలేదు. సెన్సెక్స్ క్రితం సెషన్‌తో పోలిస్తే 81,403.94 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 81,583.94 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. 81,191.04 పాయింట్ల కనిష్టానికి చేరింది. చివరకు 82.79 పాయింట్లు నష్టపోయి 81,361.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 18.80 పాయింట్లు పతనమై.. 24,793.25 వద్ద ముగిసింది.
దాదాపు 928 షేర్లు లాభపడగా.. 2,907 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో టాటా కన్స్యూమర్, ఐషర్ మోటార్, ఎం అండ్ ఎం, విప్రో, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లాభాలను ఆర్జించాయి. అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ప్రైజెస్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఒక్కొక్కటి 1.5 శాతం కంటే ఎక్కువగానే పడిపోయాయి. ఆటో మినహా మిగతా రంగాలన్నీ ఐటీ, మీడియా, మెటల్, రియాల్టీ, ఆయిల్, గ్యాస్, ఫార్మా, టెలికాం, పీఎస్‌యూ బ్యాంక్ 0.5-2 శాతం తగ్గడంతో నష్టపోయాయి.