Sensex Closing Bell | దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్ తొలిసారిగా 84వేల మార్క్‌ని దాటింది. నిఫ్టీ సైతం 25,800 పాయింట్ల ట్రేడయ్యింది. చివరకు రికార్డు స్థాయిలోనే ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1359 పాయింట్లు, నిఫ్టీ 375 పాయింట్లకుపైగా లాభపడి తొలిసారిగా గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నాలుగు సంవత్సరాల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో మార్కెట్లకు కొత్త ఊపినిచ్చినట్లయ్యింది. ఈ క్రమంలో గురువారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ ప్రభావం భారతీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు తొలిసారిగా కొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 83,603.04 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత పెరుగుతూ మధ్యాహ్నం వరకు తొలిసారిగా 84వేల మార్క్‌ను దాటింది.
అదే ఊపును కొనసాగిస్తూ తొలిసారిగా రికార్డు స్థాయిలో 84,694.46 పాయింట్లను తాకింది. చివరకు 1,359.52 పాయింట్ల లాభంతో 84,544.31 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 25,525.95 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 25,426.60 పాయింట్ల కనిష్ఠానికి చేరి.. 25,849.25 గరిష్ఠానికి చేరింది. ఈ స్థాయికి నిఫ్టీ చేరుకోవడం ఇదే తొలిసారి. చివరకు 375.15 పాయింట్ల లాభంతో 25,790.95 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో దాదాపు 2,346 షేర్లు పురోగమించగా.. 1,434 షేర్లు పతనమయ్యాయి. ఇక ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, ఎఫ్ఎంసీజీ, పవర్, టెలికాం, మెటల్, రియల్టీ ఒకశాతం నుంచి మూడుశాతం లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీలో ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఎల్అండ్టీ, అత్యధికంగా లాభపడ్డాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, ఇండస్ఇండ్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకశాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి.
iPhone 16 | ఎన్ని రోజులు పనిచేస్తే.. మీరు ఐఫోన్ 16 కొనగలరో తెలుసా..?