iPhone 16 | వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ (Apple iPhone 16 Series) ఫోన్లు భారత్ (India)లో అందుబాటులోకి వచ్చేశాయి. ఈ ఫోన్ అమ్మకాలు శుక్రవారం ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల కోసం వినియోగదారులు ఢిల్లీ, ముంబైలోని యాపిల్ రిటైల్ స్టోర్ల ముందు క్యూ కట్టారు. తెల్లవారుజాము నుంచే ఈ ఫోన్‌ను దక్కించుకునేందుకు పడిగాపులు కాస్తున్నారు. దీంతో ఆయా స్టోర్ల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఐఫోన్ ప్రియులకు ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లు శుభవార్త చెప్పాయి. గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా.. పది నిమిషాల్లోనే ఈ ఫోన్లను కస్టమర్ల వద్దకు చేర్చేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా టాటా యాజమాన్యం ఆధీనంలోని బిగ్ బాస్కెట్ (Bigbasket) కేవలం 10 నిమిషాల్లోనే సరికొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను డెలివరి చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ పరికరాల విక్రయ విభాగం క్రోమాతో కలిసి ఎంపిక చేసిన నగరాల్లో ఇవాళ్టి నుంచే ఈ సేవలను మొదలు పెట్టింది. ముంబై, ఢిల్లీ – ఎన్సీఆర్ ఈ సేవలు మొదలయ్యాయి.
Already sold 100+ iPhones, clocking in 3 per minute!!
If you want iPhone 16 now, you’ll get it now! https://t.co/gsmawCuUJe— bigbasket (@bigbasket_com) September 20, 2024
తాజాగా ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో సబ్ బ్రాండ్ బ్లింకిట్ (Blinkit) కూడా బుక్ చేసిన పది నిమిషాల్లోనే కొత్త యాపిల్ 16 సిరీస్ ఫోన్లను డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు యాపిల్ రీసెల్లర్ యూనికార్న్ సంస్థ (Apple reseller Unicorn Info Solutions)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా సకాలంలో కస్టమర్లకు కొత్త ఐఫోన్ 16 సిరీస్ పోన్లను డెలివరీ చేయనుంది. ఈ విషయాన్ని బ్లింకిట్ ఫౌండర్ అల్బిందర్ ధిండ్సా (Albinder Dhindsa) ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ – ఎన్సీఆర్, పూణె, ముంబై, బెంగళూరు నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. యూనికార్న్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో డిసౌంట్లను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈఎమ్ఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.
Get the all-new iPhone 16 delivered in 10 minutes!
We’ve partnered with @UnicornAPR for the third year in a row, bringing the latest iPhone to Blinkit customers in Delhi NCR, Mumbai, Pune, Bengaluru (for now) — on launch day!
P.S – Unicorn is also providing discounts with… pic.twitter.com/2odeJPn11k
— Albinder Dhindsa (@albinder) September 20, 2024
కాగా, యాపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లను ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్.. అనే నాలుగు మోడళ్లను ఆపిల్ తీసుకొచ్చింది. వీటిల్లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను జత చేశారు. అదే విధంగా ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18తో వచ్చింది. ఇదిలా ఉండగా.. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,900గా, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా, ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 1,19,900గా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభం ధర రూ. 1,44,900గా ఉన్నాయి. ఈ ఫోన్లు నేటి నుంచి భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం తెల్లవారుజామున నుంచి ముంబైలోని బీకేసీ స్టోర్, న్యూ ఢిల్లీలోని సాకేత్ సహా భారతదేశంలోని ఆపిల్ రిటైల్, ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.
Also Read..
iPhone 16 | ఎన్ని రోజులు పనిచేస్తే.. మీరు ఐఫోన్ 16 కొనగలరో తెలుసా..
iPhone 16 | భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల అమ్మకాలు.. వాటి విశేషాలు మీకోసం
Apple – iPhone 16 | ఐ-ఫోన్ 16 కోసం ఎగబడ్డ జనం.. తెల్లవారుజాము నుంచే ఆపిల్ స్టోర్ల ముందు క్యూ