Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్పల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైన మార్కెట్లు.. చివరి వరకు గ్రీన్ మార్క్‌లోనే కొనసాగాయి. క్రితం సెషన్ పోలిస్తే సెన్సెక్స్ 76,414.52 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 76,202.12 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. 76,743.54 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది. ట్రేడింగ్‌లో దాదాపు 2,017 షేర్లు లాభాలపడ్డాయి. మరో 1,780 షేర్లు పతనమయ్యాయి.
నిఫ్టీలో అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి. బీపీసీఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్ కార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు రెండుశాతం పెరగ్గా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం పెరిగింది. ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, మీడియా, ఫార్మా రియాల్టీ ఒకటి నుంచి రెండుశాతం వరకు వృద్ధిని నమోదు చేశాయి. మరోవైపు ఆయిల్, గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు నష్టపోయాయి.