Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రపంచ మార్కెట్లోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం పడింది. అమెరికా బాండ్ దిగుమతి పెరగడం, ఆర్థిక పరిస్థితిపై మరోసారి ఆందోళనలు పెరగడంతో పెట్టుబడిదారులను భయాందోళనకు గురి చేశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,323.05 స్వల్ప నష్టాల్లో మొదలైంది. రిలయన్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎంలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఓ దశలో వెయ్యి పాయింట్ల వరకు పతనమైంది.
ఇంట్రాడేలో 81,323.24 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యధికంగా 80,489.92 పాయింట్ల గరిష్టానికి పడిపోయింది. చివరకు 644.64 పాయింట్ల నష్టంతో 80,951.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 203.75 పాయింట్ల నష్టంతో 24,609.70 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,518 షేర్లు లాభపడగా.. 1,907 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరో మోటోకార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, భారత్ ఎలక్ట్రికల్, జియో ఫైనాన్షియల్ లాభపడ్డాయి. ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, హిందాల్కో, విప్రో, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, ఐటీసీ, హెచ్‌యూఎల్, రిలయన్స్ ప్రధానంగా నష్టపోయాయి.