Stock Market | ముంబై, ఆగస్టు 9: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకుపైగా లాభపడిన సెన్సెక్స్ 819.69 పాయింట్లు ఎగబాకి 79,705.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 250.50 పాయింట్లు అందుకొని 24,367.50 వద్ద స్థిరపడింది.
స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటంతో మదుపరుల పంట పండింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.4,46,308. 99 కోట్లు పెరిగి రూ.4,50,21,816.11 కోట్ల(5.37 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది. స్టాక్ మార్కెట్ లిస్టింగ్ రోజే ఓలా షేరు అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ.75.99 వద్ద ప్రవేశించిన కంపెనీ షేరు ధర 19.97 శాతం లాభంతో రూ.91.18 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.40,217.95 కోట్లుగా నమోదైంది.