హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): టై- హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆరో ఎడిషన్ కాంపిటీషన్లో మహిళా అంత్రప్రెన్యూర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పిలుపునిచ్చారు.
ఈ పోటీల్లో ప్రతిభ చాటిన వారు ఈ ఏడాది చివర్లో రాజస్థాన్లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు https://tie women.org/ ను సందర్శించాలని సూచించారు.