స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లోన్ ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ కావాలా? అని మీకు ఫోన్ వచ్చిందా?.. ఆయితే జాగ్రత్త. అలాంటి కంపెనీ ఏదీ తమ అనుబంధ సంస్థ కాదని ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ లోన్ ఫైనాన్స్ పేరుతో లోన్లు ఆఫర్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ బోగస్ కంపెనీని గుర్తించారు. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలను మోసం చేయడానికి ఎస్బీఐ లోన్ ఫైనాన్స్ పేరుతో తెగబడుతున్నారని తెలిపింది. ఒకవేళ బ్యాంకు నుంచి రుణం పొందాలనుకునేవారు నేరుగా బ్యాంకు శాఖను సంప్రదించవచ్చునని ఈ సందర్భంగా ఎస్బీఐ పేర్కొంది.