న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: దేశవ్యాప్తంగా కార్పొరేట్ రుణాలకు అధికంగా డిమాండ్ ఉన్నదని, రూ.4 లక్షల కోట్ల విలువైన రుణాలు తీసుకోవడానికి సంస్థలు రెడీగా ఉన్నట్లు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ప్రైవేట్ రంగం అంచనాలకుమించి రాణించే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. రోడ్లు, రెన్యూవబుల్ ఎనర్జీ, రిఫైనరీ విభాగాల నుంచి రుణాలకు డిమాండ్ ఉందన్నారు.