ముంబై, ఆగస్టు 5: దేశీయ కరెన్సీకి భారీగా చిల్లులు పడ్డాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుదుపునకు లోనుకావడం, మధ్యతూర్పు దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ఫారెక్స్ మార్కెట్లో అలజడికి కారణమైంది. దీంట్లోభాగంగా రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయి 84కి జారుకున్నది.
డాలర్‌తో పోలిస్తే మారకం విలువ సోమవారం ఒకేరోజు 37 పైసలు పడిపోయి 84.09 వద్ద ముగిసింది. 83.78 వద్ద ప్రారంభమైన రుపీ ట్రేడింగ్ ఇంట్రాడేలో 83.76 గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. 84కి పడిపోవడంతో ఫారెక్స్ మార్కెట్లో ఇదే తొలిసారి కావడం విశేషం.