దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీ స్థాయిలో నిధులను వెనక్కితీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుత వారంలోనూ రూ.5 వేల కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు.
దేశీయ కరెన్సీకి భారీగా చిల్లులు పడ్డాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుదుపునకు లోనుకావడం, మధ్యతూర్పు దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో ఫారెక్స్ మార్కెట్లో అలజడికి కారణమైంది.