BSE Sensex | అత్యంత కనిష్టానికి పడిపోయిన రూపాయి.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
BSE Sensex : భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పతనమవడం, క్రూడాయిల్ ధరలు పెరగడం మార్కెట్లపై దుష్ప్రభావం చూపింది.
BSE Sensex : భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పతనమవడం, క్రూడాయిల్ ధరలు పెరగడం మార్కెట్లపై దుష్ప్రభావం చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 160.73 పాయింట్లు (0.21 శాతం) నష్టపోయి 75,237.99 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 కూడా 46.10 పాయింట్లు (0.19 శాతం) నష్టపోయి 23,643.50 వద్ద ముగిసింది.
రూపాయి విలువ తగ్గడం, చమురు ధరలు పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం వంటివి ఇన్వెస్టర్లపై ప్రభావం చూపాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగడం, హార్ముజ్ జలసంధి పూర్తి స్ధాయిలో తెరుచుకోకపోవడం వంటివి కూడా ఇందుకు కారణాలు. ఈ కారణాలతో చమురు ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 109 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు భారతీయ రూపాయి అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. డాలర్‌తో రూపాయి విలువ 96.05 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు ఇది 95.9575 వద్ద కొనసాగింది. రూపాయి అత్యంత తక్కువ స్థాయికి చేరుకోవడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది.
రూపాయి ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఈ రోజు 0.3 శాతం తగ్గింది. చమరు ధరల పెరుగుదల, విదేశీ ద్రవ్యం అధికం కావడం, పశ్చిమాసియాలో అస్థిరత వంటివి రూపాయి పతనానికి కారణాలు. ఇండియా చమురు దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అలాగే, అమెరికా వడ్డీ రేట్లు, మారక నిల్వలు తగ్గడం కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- nifty
- Rupee
- Sensex
- stock market
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

