
Reliance Lithieum Battery | మున్ముందు విద్యుత్ వాహనాలదే భవిష్యత్.. ఈ నేపథ్యంలో ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. విద్యుత్ వాహనాల తయారీలో కీలకమైన లిథియం ఆయన్ బ్యాటరీ బిజినెస్‌లోకి అడుగు పెట్టనున్నది. తద్వారా భారత్‌లో భారీ స్థాయిలో లిథియం అయాన్ బ్యాటరీ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయడంపై ఫోకస్ చేస్తున్నది. అమెరికాకు చెందిన సంస్థ అంబ్రీ ఇంక్ పరిశ్రమ ప్రతినిధులతో రిలయన్స్ టీమ్ చర్చలు జరుపుతున్నది.
అందుకోసం అమెరికా కంపెనీ అంబ్రీ ఇంక్‌లో 50 మిలియన్ డాలర్ల విలువైన వాటాలను కొనుగోలు చేయనున్నది రిలయన్స్ అనుబంధ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (ఆర్ఎన్ఈఎస్ఎల్). అంటే అంబ్రీలో 42.3 మిలియన్ల షేర్లను కొనుగోలు చేయనున్నది.
అమెరికాలోని మాసాచ్చుసెట్స్ కేంద్రంగా అంబ్రీ ఇంక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఈ సంస్థలో పెట్టుబడులతో ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘ కాల ఇంధన నిల్వ వ్యవస్థల్లో ఎదగడానికి వీలవుతుంది. పాల్సన్ అండ్ కో ఇంక్, బిల్ గేట్స్‌తో సహా కొందరు ఇన్వెస్టర్లతో కలిసి ఎనర్జీ స్టోరేజీ కంపెనీ అంబ్రీ ఇంక్‌లో 144 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు.
Neeraj Chopra Workout : నీరజ్ చోప్రా ‘పసిడి’ రహస్యమిదే..?!
pace Wedding : అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్‌లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
Ujjwala 2.0 : ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించిన మోదీ
HP Envy Laptops : హైఎండ్ ఫీచర్లతో హెచ్‌పీ 11th Gen లాప్టాప్స్.. 16.5 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో
Lionel Messi: ఫ్రీగా ఆడతానన్నా మెస్సీ బార్సిలోనాలో కొనసాగడం కుదరదు.. ఎందుకు?