HP Envy Laptops : హైఎండ్ ఫీచర్లతో హెచ్‌పీ 11th Gen లాప్టాప్స్.. 16.5 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో
హెచ్‌పీ తాజాగా envy సిరీస్ లాప్టాప్లను విడుదల చేసింది. ఇండియా మార్కెట్లోకి HP Envy 14 and HP Envy 15 లాప్టాప్స్ రిలీజ్ అయ్యాయి.

సరికొత్త ఎన్వీ సిరీస్ లాప్టాప్స్.. 11th gen ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. అలాగే.. ఎన్విడియా జీఈఫోర్స్ ఆర్టీఎక్స్ 3060 గ్రాఫిక్ కార్డు ఈ లాప్‌టాప్‌లలో ఉండే ప్రత్యేక ఫీచర్. హెచ్‌పీ ఎన్వీ 14 లాప్టాప్ ధర రూ.1,04,999గా నిర్ణయించగా… హెచ్‌పీ ఎన్వీ 15 లాప్టాప్ ధరను రూ.1,54,999గా నిర్ణయించారు. ఈ లాప్టాప్లను రిలయెన్స్ డిజిటల్‌తో పాటు క్రోమా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.
ఈ సిరీస్ లాప్‌టాప్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు ఒక నెల పాటు రూ.4,230 విలువ గల అడోబ్ ప్రొడక్టివిటీ, డిజైన్ టూల్స్‌కు ఉచితంగా యాక్సెస్ ఉంటుంది. ఈ లాప్టాప్స్ను ప్రత్యేకంగా.. క్రియేటర్స్, డిజైనింగ్ ప్రొఫెషనల్స్ కోసం తయారు చేశారు.

రెండు మోడల్స్‌లో ఫోకస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. 100 శాతం ఎస్ఆర్జీబీ సపోర్ట్‌తో డిస్ప్లే ఉంటుంది. 16:10 డిస్ప్లేతో 400 నిట్స్ బ్రైట్నెస్ను కలిగి ఉంటాయి. ఎన్వీ 14 మోడల్.. 14 ఇంచ్ స్క్రీన్‌తో, ఎన్వీ 15 మోడల్.. 15 ఇంచ్ స్క్రీన్‌తో లభిస్తాయి.
రెండు లాప్‌టాప్‌లు ఒకసారి చార్జ్ చేస్తే 16.5 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయని హెచ్‌పీ వెల్లడించింది. అలాగే.. థండర్‌బోల్ట్ 4 పోర్ట్, యూఎస్బీ – ఏ పోర్ట్స్, 3.5 ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్, వైఫై, ఇతర కనెక్టివిటీ ఆప్షన్లు ఈ లాప్‌టాప్స్‌లో ఉంటాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

