కాన్పూర్ : కాన్పూర్‌లో ఈ నెల 9న కొందరిపై లంబోర్గిని కారు దూసుకెళ్లిన కేసులో ప్రధాన నిందితుడు, ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడైన శివమ్ మిశ్రాకు గురువారం అరెస్టయిన కొన్ని గంటలకే బెయిల్ లభించింది. ఈ కేసుకు సంబంధించిన వీడియో ప్రకారం ప్రమాదం తర్వాత డ్రైవర్ సీట్ నుంచి శివమ్ మిశ్రాను అతడి బౌన్సర్లు బయటకు లాగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. ప్రమాద సమయంలో తానే కారును నడుపుతున్నట్టు అతడి డ్రైవర్ మోహన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.
తాను వాహనం మీద నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నాడు. శివమ్ బౌన్సర్లు ప్రమాదం తర్వాత పోలీసుల సమక్షంలోనే కారు నంబర్ ప్లేట్‌ను తీసి పారేసేందుకు ప్రయత్నించినట్టు ఓ వీడియోలో కనిపించింది. ప్రధాన నిందితుడి తండ్రి ప్రముఖ వ్యాపారి అయినందు వల్లే అతడికి వెంటనే బెయిల్ లభించిందని బాధితులు విమర్శించారు.