Reliance | త్వరలో రిలయన్స్ బట్టల దుకాణం..!
Reliance | మహిళల సంప్రదాయ దుస్తులు.. బంగారం ఆభరణాల స్టోర్ల ఏర్పాటుకు రిలయన్స్ రంగం సిద్ధం చేస్తోంది. బెంగళూరులో తొలి స్టోర్ రానుంది.

Reliance | పలు రంగాల్లో వ్యాపార లావాదేవీలు లావాదేవీలు నిర్వహిస్తున్న రిలయన్స్.. మరో అడుగు ముందుకేస్తోంది. వనితలకు ఇష్టమైన చీరలు, సంప్రదాయ దుస్తులు.. ప్రీతిపాత్రమైన ఆభరణాల కోసం దుకాణాలు ప్రారంభించడానికి రిలయన్స్ రిటైల్ రంగం సిద్ధం చేసింది. అవంత్రా బ్రాండ్ స్టోర్ల పేరిట విపణిలోకి రానున్నది.
తనిష్క్.. ఆదిత్య బిర్లాతో ఇలా పోటీ
సంప్రదాయ దుస్తులు, చీరల మార్కెటింగ్‌లో టాటా సన్స్ గ్రూప్ తనిష్క, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్)తో పోటీ పడేందుకు సిద్ధం అయ్యింది. పండుగల సీజన్‌తోపాటు వివాహాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రిలయన్స్ రిటైల్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకున్నది. బ్రిక్ అండ్ మోర్టార్ చైన్ స్థాయిలో మిడ్ సైజ్ స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై స్పందించడానికి రిలయన్స్ రిటైల్ ప్రతినిధి ముందుకు రాలేదు.
ఇదీ తనిష్క్ స్పెషాలిటీ.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ కూడా..
సంప్రదాయ దుస్తులు, జ్యువెల్లరీ బ్రాండ్‌కు తనిష్క్ పెట్టింది పేరు. ఇక సవ్యసాచి, తరుణ్ తాహిల్యానీ లేబుల్స్‌తో డొమెస్టిక్ డిజైనర్ దుస్తుల్లో ఆదిత్య బిర్లా వారి ఏబీఎఫ్ఆర్ఎల్ కూడా గణనీయ వాటానే పొందుతున్నది. విదేశీ.. ప్రత్యేకించి పాశ్చాత్య డ్రెస్‌ల ట్రెండ్‌కు కుర్రాళ్లు ప్రాధాన్యం ఇస్తున్నా.. దేశీయంగా సంప్రదాయ దుస్తులకు కూడా స్ట్రాంగ్ మార్కెట్ ఉంది.

అవంత్రా బ్రాండ్ పేరిట రిలయన్స్..
సంప్రదాయ దుస్తులు, చీరల పట్ల మగువలకు ఉన్న మక్కువను క్యాష్ చేసుకునేందుకు అవంత్రా బ్రాండ్ పేరిట రిలయన్స్ రిటైల్.. ప్రాంతీయ వీవర్ క్లస్టర్లు, నల్లి సిల్క్స్, పోథ్యీస్ వంటి పలు థర్డ్ పార్టీ బ్రాండ్స్‌తో భాగస్వామ్యంతో కస్టమర్లకు విభిన్న రకాల చీరలు, దుస్తులు అందుబాటులోకి తెస్తోంది. జ్యువెల్లరీ, టైలరింగ్ సేవలు కూడా లభిస్తాయని రిలయన్స్ రిటైల్ వర్గాల కథనం.
ఏపీ.. కర్ణాటకల్లో విస్తరణకు ప్లాన్లు..
తొలుత బెంగళూరు కేంద్రంగా తొలి అవంత్రా.. చీరల, సంప్రదాయ దుస్తుల దుకాణాన్ని ప్రారంభించనున్నది రిలయన్స్ రిటైల్. అటుపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో విస్తరించనున్నది. ప్రతిఏటా మహిళ సంప్రదాయ దుస్తుల మార్కెట్ 10 శాతం పెరుగుతూనే ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!
క్రెడిట్ కార్డుతో జర జాగ్రత్త
Relief for senior citizens | వృద్ధులకు రిలీఫ్.. నో ఐటీఆర్!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

