Jio | దేశవ్యాప్తంగా ప్రముఖ టెలికం నెట్వర్క్ ‘జియో’ టెలికం సేవలకు అంతరాయం కలిగింది. జియో మొబైల్ నెట్ వర్క్ తోపాటు జియో ఫైబర్ సేవలకూ అంతరాయం కలిగినట్లు సమాచారం. దీనివల్ల వివిధ సంస్థల్లో వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్న ఉద్యోగులు ఇబ్బందులెదుర్కొన్నట్లు తెలుస్తోన్నది. దీంతో జియో యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ వెల్లడించిన సమాచారం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.11 గంటల నుంచి జియో ఫైబర్, జియో మొబైల్ ఇంటర్నెట్, జియో మొబైల్ నెట్ వర్క్ కనెక్టివిటీ విషయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకల్లా సాంకేతిక సమస్యలు పీక్ స్టేజీకి వెళ్లాయని సుమారు 2400 మంది యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. జియో టెలికం సేవల్లో అంతరాయానికి కారణాలేమిటన్నది తెలియలేదు. దీనిపై రిలయన్స్ జియో అధికారికంగా స్పందించలేదు. జియో కస్టమర్ కేర్ సిబ్బంది కూడా తమ ఫోన్ కాల్స్‌కు యూజర్లు చెబుతున్నారు.