హైదరాబాద్, మే 30: రిలయన్స్ జియో తెలుగు రాష్ర్టాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఏప్రిల్ చివరి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో జియో నెట్‌వర్క్‌లోకి కొత్తగా 95,310 సబ్‌స్ర్కైబర్లు జతయ్యారని తెలిపింది. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 3,18,71,384కి చేరుకున్నారు.
ఇదే సమయంలో తన పోటీ సంస్థ ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను 42,600 మంది ఎంచుకోగా, బీఎస్ఎన్ఎల్ 1,715 సబ్‌స్ర్కైబర్లు చేరారు. కానీ వొడాఫోన్ ఐడియా 9,058 మంది కస్టమర్లను కోల్పోయింది.