న్యూఢిల్లీ, జూలై 16: టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మొబైల్ సబ్‌స్ర్కైబర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. మే నెల చివరినాటికి ఈ రెండు సంస్థల నెట్‌వర్క్‌ను 34.4 లక్షల మంది ఎంచుకున్నారు. వొడాఫోన్ ఐడియా మాత్రం కస్టమర్లను కోల్పోతున్నది.
ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. జియో కొత్త 21.9 లక్షల మంది చేరగా దీంతో మొత్తం సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 47.46 కోట్లకు చేరుకున్నారు. భారతీ ఎయిర్‌టెల్‌ను 12.5 లక్షల మంది చేరారు.
వొడాఫోన్ ఐడియా మాత్రం 9.24 లక్షల మంది వైర్లెస్ యూజర్లను కోల్పోయింది. ఇదే నెలలో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ చేసుకునేవారి సంఖ్య 97.36 కోట్ల నుంచి 98.56 కోట్లకు చేరుకున్నారు. అలాగే బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్ర్కైబర్లు 93.5 కోట్లకు చేరారు.