Rs 2000 | ఇంకా చలామణిలో రూ.24 వేల కోట్లే .. రూ.2000 నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ
Rs 2000 | గత మే 19 నుంచి ఆగస్టు 31 వరకు రూ.2000 నోట్లు 93 శాతం బ్యాంకులకు తిరిగొచ్చాయని ఆర్బీఐ తెలిపింది. మరో రూ.24 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని వెల్లడించింది.
Rs 2000 | క్లీన్ నోట్ పాలసీలో భాగంగా మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.2000 కరెన్సీ నోట్లను ఉపసంహరించింది ఆర్బీఐ. గత మే 19న వీటిని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు.. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ లేదా.. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఎక్స్చేంజ్ చేసుకోవాలని ఆదేశించింది. ఈ నెలాఖరుతో రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ గడువు ముగుస్తున్నది. ఇంకా ఏడు శాతం నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది ఆర్బీఐ.
ఆగస్టు 31 వరకు 93 శాతం రూ.2000 కరెన్సీ నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. అంటే రూ.3.32 లక్షల కోట్ల విలువైన రూ.2000 కరెన్సీ నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘2023 ఆగస్టు 31 నాటికి కేవలం 0.24 లక్షల కోట్ల విలువైన రూ.2000 కరెన్సీ నోట్లు మాత్రమే మార్కెట్లో చలామణిలో ఉన్నాయి. 2023 మే 19 నుంచి ఇప్పటి వరకు 93 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయి’ అని తెలిపింది ఆర్బీఐ. వాటిల్లో 87 శాతం రూ.2000 నోట్లు డిపాజిట్ల రూపంలో, మిగతా 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లతో మార్పిడి ద్వారా బ్యాంకులకు తిరిగి వచ్చాయని వివరించింది.
2023 మార్చి 31 నాటికి రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2000 కరెన్సీ నోట్లు మార్కెట్లో చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. కానీ, 2023 మే 19 నాటికి చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లకు పడిపోయింది.
ఈ నెలాఖరుతో రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్లకు గడువు ముగియనున్నది. ఈ గడువు లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ ద్వారా మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. రూ.2000 విలువైన కరెన్సీ నోట్లు మార్కెట్లో పెద్దగా చలామణిలో లేవని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత మే 24న తెలిపారు. కనుక ఆ నోట్ల ఉపసంహరణకు ఇబ్బందులు తలెత్తకపోవచ్చునని కూడా చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

