Interest Rates hike | జూన్‌లో మళ్లీ వడ్డీరేట్ల పెంపు తప్పదా.. ధరల కట్టడికి ఆర్బీఐ వ్యూహం అదేనా!
Interest Rates hike | పెరిగిపోతున్న ధరల ప్రభావ నియంత్రణకు జూన్‌లో ఆర్బీఐ మరోమారు రెపోరేట్ పెంచనున్నదని సమాచారం.
Interest Rates hike | పెరిగిపోతున్న ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు వడ్డీరేట్ల పెంపుపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నది. ఈ నెల నాలుగో తేదీన జరిగిన అత్యవసర ద్రవ్య పరపతి సమీక్షలో 40 బేసిక్ పాయింట్లు రెపోరేట్‌ను ఆర్బీఐ పెంచేసిన సంగతి తెలిసిందే. వచ్చేనెలలో జరిగే ద్వైమాస ద్రవ్య పరపతి సమీక్షలో మరోదఫా రెపోరేట్ పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ వర్గాల కథనం.
రెండేండ్ల క్రితం రెపోరేట్‌ను అత్యంత కనిష్ఠ స్థాయి నాలుగు శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న నంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో 40 బేసిక్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో రెపోరేట్ 4.40 శాతానికి పెరిగింది.
ఏప్రిల్ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఫిబ్రవరి అంచనాల కంటే 120 బేసిక్ పాయింట్లు ఎక్కువ. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిరేటును 7.8 నుంచి 7.2 శాతానికి కుదించేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా భారత్ జీడీపీ 6.1 శాతం అని ప్రకటించింది. వచ్చేనెల 6-8 తేదీల మధ్య ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష జరుగనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

