సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ధరను ప్రకటించిన ఆర్బీఐ
రెండో విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించింది. గ్రాముకు రూ.5,923గా నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి సబ్స్క్రిప్షన్ మొదలు కానున్న విషయం తెలిసిందే. 15 వరకు అందుబాటులో ఉంటుంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: రెండో విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించింది. గ్రాముకు రూ.5,923గా నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి సబ్స్క్రిప్షన్ మొదలు కానున్న విషయం తెలిసిందే. 15 వరకు అందుబాటులో ఉంటుంది. కాగా, 999 స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు సాధారణ సగటు ధర ఆధారంగా బాండ్ నామినల్ వాల్యూను నిర్ణయించినట్టు ఆర్బీఐ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఈ సిరీస్-2 ఎస్‌జీబీలు వస్తున్నాయి.
ఇక ఆన్లైన్లో దరఖాస్తు, డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసే మదుపరులకు ధరపై రూ.50 రాయితీ లభిస్తుంది. గ్రాము రూ.5,873కే వస్తుందన్నమాట. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) వంటి గుర్తింపున్న స్టాక్ ఎక్సేంజీలు.. ఈ ఎస్జీబీలను అమ్ముతాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ వీటిని జారీ చేస్తుంది. భౌతిక బంగారం కొనుగోళ్లకు దీన్నో ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. 2015 నవంబర్‌లో ఈ ఎస్జీబీ స్కీం పరిచయమైంది. భౌతిక బంగారానికి ఉన్న డిమాండ్‌ను తగ్గించడమే ఈ ఎస్‌జీబీల లక్ష్యం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

