LPG cylinder | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు (Commercial LPG cylinder) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గించాయి. 19 కేజీల సిలిండర్‌పై రూ.39.50 తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. తగ్గించిన కొత్త రేట్లు ఈ రోజు అంటే 2023, డిసెంబర్ 22 నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపాయి.
ధరలు తగ్గిన తర్వాత దేశరాజధాని న్యూఢిల్లీలో రూ.1796.50 ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,757కు తగ్గింది. ముంబైలో రూ.1,710, కోల్‌కతాలో రూ.1,868, చెన్నైలో రూ.1,929కి స్వల్పంగా తగ్గాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా, గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
Also Read..
Triple Talaq | సోదరుడికి కిడ్నీదానం చేసిన మహిళ.. వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
Nirmala Sitharaman | తమిళనాడుకు వరద సాయం కింద రూ.900 కోట్లు ఇచ్చాం : కేంద్ర ఆర్థిక మంత్రి