Special Trains | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి 20 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలు ఇవే!
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway) శుభవార్త తెలిపింది. రానున్న సంక్రాంతి (Sankranti) పండగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 20 ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రకటించింది.
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway) శుభవార్త తెలిపింది. రానున్న సంక్రాంతి (Sankranti) పండగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 20 ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రకటించింది. పండగ కోసం సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.
సంక్రాంతి పండగ సందర్భంగా కాచిగూడ-కాకినాడ టౌన్, హైదరాబాద్-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకూ ఈ రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆ రైళ్ల పూర్తి వివరాలు ఎస్సీఆర్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది.
రైల్వే శాఖ పొందుపరిచిన వివరాల ప్రకారం..
తిరుపతి – హైదరాబాద్ రైలు (07510) డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు శుక్రవారం రాత్రి 8:15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. అదేవిధంగా, హైదరాబాద్ – తిరుపతి రైలు (07509) డిసెంబర్ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది. ఈ రైలు గురువారం రాత్రి 7:25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
ఇక హైదరాబాద్ -తిరుపతి- హైదరాబాద్ స్పెషల్ ట్రైన్స్ సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది.
కాచిగూడ – కాకినాడ టౌన్ రైలు (07653) డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు గురువారం రాత్రి 8:30 గంటలకు కాచిగూడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుతుంది. అదేవిధంగా, కాకినాడ టౌన్- కాచిగూడ రైలు (07654) డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 5.10 గంటలకు ఈ రైలు కాకినాడ టౌన్ నుంచి బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
అదేవిధంగా కాచిగూడ-కాకినాడ టౌన్, కాకినాడ టౌన్-కాచిగూడ స్పెషల్ రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తాయి.
Also Read..
Salaar | థియేటర్స్ వద్ద సలార్ సందడి.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదుగా.. VIDEOS
Emmanuel Macron | గణతంత్ర వేడుకలకు చీఫ్‌గెస్ట్‌గా ఫ్రాన్స్ అధ్యక్షుడు
Coronavirus | 3 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు.. కొత్తగా 328 మందికి పాజిటివ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

