Triple Talaq | అనారోగ్యంతో బాధపడుతున్న తోబుట్టువుకు సాయం చేసి ఓ ఇల్లాలు ఇప్పుడు చిక్కుల్లో పడింది. కిడ్నీ పాడై ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న సోదరుడి (brother)కి కిడ్నీ దానం చేసింది ఓ మహిళ. అయితే ఆ సాయమే ఆమె కాపురాన్ని కూల్చింది. కిడ్నీ దానం (donates kidney) చేసిన విషయం తెలుసుకున్న ఆమె భర్త.. మహిళకు ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ (Triple Talaq) చెప్పి ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని గోండా ప్రాంతానికి చెందిన తరన్నమ్, మహమ్మద్ రషీద్‌లకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన తర్వాత రషీద్ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. ప్రస్తుతం తరన్నమ్ తన అత్తమామలతో కలిసి గోండాలోనే నివసిస్తోంది. కాగా, తరన్నమ్ సోదరుడు మొహమ్మద్ షకీర్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి ఓ కిడ్నీ పూర్తిగా పాడైపోయింది. అతడికి వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. అయితే, కిడ్నీ కొనేందుకు అతడికి అంత ఆర్థిక స్థోమత లేదు. పైగా కిడ్నీ దానం చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తన సోదరుడి బాధ చూడలేక.. తరన్నమ్ కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించి.. ఆ మహిళ కిడ్నీని తీసి ఆమె సోదరుడికి విజయవంతంగా అమర్చారు. సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ పూర్తి కాగా.. ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
అయితే శస్త్రచికిత్స తర్వాత తరన్నమ్ గోండాలోని తన అత్తమామల ఇంటికి తిరిగి వచ్చింది. అయితే, కిడ్నీ దానం చేసిన విషయంలో విదేశాల్లో ఉన్న భర్త (NRI husband) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో భార్యభర్తల మధ్య విభేదాలు పెరిగాయి. కిడ్నీ దానం చేసినందుకు తరన్నమ్ నుంచి రషీద్ రూ.40లక్షలు డిమాండ్ చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఆగస్టు 30న వాట్సాప్ సందేశం ద్వారా ట్రిపుల్ తలాక్ సందేశం పంపాడు. ఈ ఘటనతో షాక్ అయిన మహిళ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భర్తపై కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Also Read..
Salaar | థియేటర్స్ వద్ద సలార్ సందడి.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదుగా.. VIDEOS
Emmanuel Macron | గణతంత్ర వేడుకలకు చీఫ్‌గెస్ట్‌గా ఫ్రాన్స్ అధ్యక్షుడు