Home Loans | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు పెంచేశాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచే వడ్డీరేట్ల పెంపు అమల్లోకి వచ్చినట్లు తెలిపాయి. దీంతో రెండు బ్యాంకుల్లో ఇండ్ల రుణాలు తీసుకున్న వారి నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లింపులు భారం కానున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ టెన్యూర్ల వారీగా 40 బేసిక్ పాయింట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 15 బేసిక్ పాయింట్లు ఎంసీఎల్ఆర్ పెంచాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఎంసీఎల్ఆర్ నెల రోజుల టెన్యూర్ రుణాలపై 6.65 నుంచి 7.75 శాతానికి, మూడు నెలల టెన్యూర్ రుణాలపై 7.80, ఆరు నెలల గడువు రుణాలపై 8.05 శాతానికి పెరిగింది. ఏడాది గడువు రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.15 నుంచి 8.30 శాతానికి, మూడేండ్ల టెన్యూర్ రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.50 శాతానికి పెరిగింది.
టెన్యూర్ —– పెరిగిన ఎంసీఎల్ఆర్
ఓవర్‌నైట్ —- 7.30 శాతం
నెల ———– 7.75 శాతం
3 నెలలు —– 7.80 శాతం
6 నెలలు —– 8.05 శాతం
ఏడాది ——– 8.30 శాతం
3 ఏండ్లు —— 8.50 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో ఓవర్‌నైట్ బెంచ్‌మార్క్.. ఎంసీఎల్ఆర్ 7.45 నుంచి 7.80 శాతానికి, నెల టెన్యూర్ రుణాలపై 7.90, మూడు నెలల టెన్యూర్‌పై 8, ఆరు నెలల టెన్యూర్‌పై 8.20 శాతానికి పెరిగింది. ఏడాది టెన్యూర్ రుణంపై ఎంసీఎల్ఆర్ 20 బేసిక్ పాయింట్లు పెరిగి 8.10 నుంచి 8.30 శాతానికి, మూడేండ్ల గడువు రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.40 నుంచి 8.60 శాతానికి పెరిగింది.
టెన్యూర్ —– పెరిగిన ఎంసీఎల్ఆర్
ఓవర్‌నైట్ —- 7.45 నుంచి 7.80 శాతం
నెల ———– 7.50 నుంచి 7.90 శాతం
3 నెలలు —– 7.60 నుంచి 8.00 శాతం
6 నెలలు —– 7.80 నుంచి 8.20 శాతం
ఏడాది ——– 8.10 నుంచి 8.30 శాతం
ఎంసీఎల్ఆర్ లింక్డ్ ఇండ్ల రుణాలకు ఆరు నెలలు లేదా ఏడాది గడువు ఉంటుంది. మీ ఇంటి రుణం ఆధారంగా రుణంపై ఎంసీఎల్ఆర్ ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఎంసీఎల్ఆర్ పెరిగితే మీ హోంలోన్ ఈఎంఐ పెరుగుతుంది. హోంలోన్ రీసెట్ తేదీ వచ్చినప్పుడు ఎంసీఎల్ఆర్ పెరుగుతుంది. రుణ గ్రహీత వేతన జీవి లేదా స్వయం ఉపాధిపై ఇంటి రుణం తీసుకున్నా ఎంసీఎల్ఆర్పై ప్రభావం పడుతుంది. రుణం తీసుకున్న వారి సిబిల్ స్కోర్ ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు.