గురువారం 28 మే 2020
Business - May 09, 2020 , 01:09:31

రూ.1.54 లక్షల కోట్లు

రూ.1.54 లక్షల కోట్లు

  • 2019-20లో దేశీయ ఫార్మా ఎగుమతులు
  • లక్ష్యాన్ని దెబ్బతీసిన కరోనా వైరస్‌: ఫార్మాగ్జిల్‌

హైదరాబాద్‌, మే 8: దేశీయ ఫార్మా ఎగుమతుల లక్ష్యానికి కరోనా వైరస్‌ గండికొట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో 20.58 బిలియన్‌ డాలర్ల విలువైన ఔషధాలు మా త్రమే ఎగుమతి అయ్యా యి. మన కరెన్సీలో ఇది రూ.1.54 లక్షల కోట్లు. అంతకుముందు ఏడాది నమోదైన 19.13 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 7.57 శాతం పెరిగినప్పటికీ, లక్ష్యానికి సుదూరంలో నిలిచినట్టు  వాణిజ్యశాఖ ఆధ్వర్యంలోని ఫార్మాస్యూటికల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఫార్మాగ్జిల్‌) శుక్రవారం వెల్లడించింది.  తొలి మూడు త్రైమాసికాలపాటు 11.5 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న ఎగుమతులు.. నాలుగో త్రైమాసికంలో ప్రతికూలానికి పడిపోయాయని తెలిపింది. ముఖ్యంగా ఫిబ్రవరిలో 7.7 శాతానికి, మార్చిలో మైనస్‌ 23.24 శాతానికి జారుకున్నట్టు పేర్కొంది. మొత్తంమీద నాలుగో త్రైమాసికంలో ప్రతికూల వృద్ధి 2.97 శాతం నమోదైంది. అమెరికా మార్కెట్లో ఔషధాల ధరలు స్థిరంగా ఉండటం, తొలి తొమ్మిది నెలలు ఎగుమతులు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోవడంతో 2019-20లో 22 బిలియన్‌ డాలర్ల మార్క్‌కు చేరుకుంటుందని ఆశించినప్పటికీ ఈ లక్ష్యానికి చేరుకోలేక పోయినట్లు ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ భాస్కర్‌ తెలిపారు.  ఫార్మా ఎగుమతుల్లో ఫార్ములేషన్‌, బయోలాజికల్‌ వాటా 72 శాతం వాటా ఉండగా, వీటి ఎగుమతుల్లో వృద్ధి 9.5 శాతానికి పరిమితమైందన్నారు. 
logo